Wheel of Dhamma

Bodhi Leaf

 
Bleaf 90x98
Dhamma Nāgājjuna2, Nagarjun Sagar, Telangana, ఇండియా
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం
**ప్రత్యేక సూచనలు ఇస్తే తప్ప, శిబిరం నియమాలు క్రింది భాషలలోనే తెలుపబడును: హిందీ / ఆంగ్లం / తెలుగు

 
10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
అన్ని పది రోజుల శిబిరంలు మొదటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యి చివరి రోజు తర్వాతి రోజు ఉదయం ముగియబడతాయి
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
2024 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
14 December, 2024 - 29 January, 2025 45-రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar ప్రత్యేక శిబిర అర్హతలు
2025 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
02 Feb - 17 Feb ఆచార్యుల స్వీయ శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar ప్రత్యేక శిబిర అర్హతలు
 
 

మీరు ఆన్ లైన్లో నింపిన దరఖాస్తు, మీ కంప్యూటర్ నుండి అప్లికేషను సర్వర్ కు పంపే ముందు, మీ సమాచారం ఎన్క్రిప్షన్ (గుప్తీకరణ) చేయబడుతుంది. అయితే ఇది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. ఎన్క్రిప్షన్ ఉపయోగించినప్పటికి మీ సమాచార భద్రత గురించి మీకు ఆందోళన ఉంటే ఇంటర్నెట్, బదులుగా ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన తరువాత దరఖాస్తును ఫ్యాక్స్ ద్వారా కాని పోస్ట్ ద్వారా కాని శిబిరం నిర్వాహకులకు పంపండి. ఇది నమోదు ప్రక్రియను ఒకటి లేక రెండు వారాల వరకు ఆలస్యం చేయవచ్చు.


పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://nagajjuna2.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: info@nagajjuna2.dhamma.org

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


ప్రత్యేక శిబిర అర్హతలు

45-రోజుల శిబిరాలు కనీసము ఏడు 10 రోజుల శిబిరాలు (మొదటి 30 రోజుల శిబిరం తరవాత ఒకటి), రెండు 30-రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం చేసి, కనీసము 3 సంవత్సరముల వరకు నియమ బద్ధంగా సాధన చేస్తూ, ధమ్మ సేవలో నిమగ్నమయి ఉన్న వారు లేక సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే.

ఆచార్యుల స్వీయ శిబిరాలు గంభీర పాత సాధకులు ఎవరైతే ధమ్మంను విస్తరింపజేయుటకు ప్రముఖ పాత్ర వహిస్తున్నారో లేక వహించాబోతున్నారో, విపశ్యన సాధనను నిష్ఠగా చేస్తూ (ఇతర ఏ విధములైన ధ్యాన పద్ధతులను అనుసరించకుండా) రోజూ 2 గంటల సేపు ధ్యానం చేస్తూ. హింస,వ్యభిచారము, మద్యపానముల నుండి దూరంగా ఉంటూ ఇతర శీలములను స్వశక్తి మేరకు పాటిస్తూ ఉన్న వారి కొరకు మాత్రమే. ఈ నియమాలు శ్రీ సత్యనారాయణ గోయెంకా గారి నిర్దేశానుసారము ప్రతి ఏటా మారవచ్చును.

దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.