ధమ్మ సేవకుల కోసం ప్రవర్తనా నియమావళి

ధమ్మ సేవ మీకు అత్యంత ప్రయోజనం కలిగించునని నిరుపించబడు గాక! మీరు ఇందులో విజయవంతులవ్వాలని ఆశిస్తూ, ఈ క్రింది సమాచారాన్ని అందిస్తున్నాము. దయచేసి సేవ చేయడానికి వచ్చే ముందు ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి.

నిస్వార్థ సేవ

నిస్వార్థ సేవ చేయటం, ధమ్మ మార్గపు అతి ముఖ్యమైన భాగం, ముక్తి దిశగా ఒక ముఖ్య మైన అడుగు. విపశ్యన సాధన, మానసిక వికారాలను క్రమంగా రూపుమాపి, అంతః శాంతిని, ఆనందాన్ని పొందేటట్లు చేస్తుంది. దుఖం నుండి ఈ ముక్తి మొదట పాక్షికంగానే ఉండవచ్చు. కాని ఇది ధమ్మ, ఇంత అద్భుత ధమ్మ విద్య దొరికినందుకు లోతైన కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది. ఈ ప్రేమ, కరుణ భావాలు, ఇతరులు వారి కష్టాల నుండి బయట పడేందుకు సహాయం చేయాలనే కోరికను సహజంగానే కలిగిస్తాయి. ఇతరులు ధర్మాన్ని నేర్చుకునే శిబిరాలలో ప్రతిఫలాపేక్ష లేకుండా, సేవ అందించడం, ఆ కృతజ్ఞతా భావలాను వ్యక్తపరచడానికి మంచి అవకాశం. నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం ద్వార, మనలో పది పారమితలను పెంపొందించుకొని, అహంభావాన్ని తగ్గించుకొని మనకు మనం సహాయం కుడా చేసుకొంటాము.

ధమ్మ సేవ చేయడానికి ఎవరు అర్హులు?

శ్రీ గోయెంక గారితో లేదా ఆయన సహాయక ఆచార్యులతో ఒక 10 రోజుల శిబిరం విజయవంతంగా పూర్తి చేసిన వారు మరియు వారి చివరి విపశ్యన ధ్యాన శిబిరం పూర్తి అయినప్పటి నుండి ఏ ఇతర ధ్యాన పద్దతిని సాధన చేయని వారు ధమ్మ సేవ చేయవచ్చు. సేవకులు ఇంట్లో దినసరి ధ్యానం చేయడం ప్రోత్సాహకరం.

క్రమశిక్షణ నియమావళి

ప్రత్యేకించి సూచనలు ఇస్తే తప్ప శిబిర నియమాలను వీలైంత వరకు ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమాలు ధమ్మ సేవకులకు కూడా వర్తిస్తాయి. ఏవో కొన్ని సందర్భాలలో మాత్రమే వాటి సడలింపుకు అనుమతి ఉంటుంది.

పంచ శీలాలు

క్రమశిక్షణ నియమావళికి పంచశీల పాలన పునాది: 1. ప్రాణ హింస చేయకుండా ఉండటము. 2. దొంగతనము చేయకుండా ఉండటము. 3. లైంగిక దురాచారాలుచేయకుండా ఉండటం.(దీని అర్థం కేంద్రంలో ఎటువంటి లైంగిక చర్యలు జరపకుండుట) 4. అసత్య వాక్కులు, పనికిరాని మాటలు మాట్లాడకుండా ఉండటం. 5. మత్తు పదార్థాలు సేవించకుండా ఉండుటం.

ఈ పంచేశీలాలను కేంద్రంలోని వారందరూ తప్పనిసరిగా, అన్ని వేళల్లోను నిష్ఠగా పాటించాలి. సేవలందిస్తున్న వారు కూడా వారి దైనందిన జీవితాల్లో ఈ పంచ శీలాలను పాటించడానికి గట్టి ప్రయత్నము చేయవలెను.

మార్గదర్శకత్వాన్ని అంగీకరించడం

ధర్మసేవకులు ఆశ్రమ నిర్వహణ విషయంలో ఆచార్యులు మరియు ఆశ్రమ నిర్వాహకుల సూచనలు తప్పక పాటించాలి.సాధనలో లేక సేవలో అనుభవమున్న వాళ్ళిచ్చే సలహాలను స్వీకరించాలి. నిర్వాహకుల అనుమతి లేకుండా అమలులో ఉన్న పద్ధతులకు వ్యతిరేకంగా ఏ కొత్త పనులూ చేపట్టకూడదు. ఎటువంటి మార్పులూ చేయడానికి ప్రయత్నించకూడదు. అటువంటి పనులు గందరగోళానికి దారితీయడమే కాక, ఒకే పనిని, ఒకరికి తెలియకుండా మరొకరు చేసినందువల్ల సమయం, సంపత్తి వృధా అవుతాయి. పరస్పర సహకారం లేకుండా, సూచనలను విస్మరించి స్వతంత్ర ప్రతిపత్తితో పనులు చేయాలనుకోవటం ధార్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. సూచనలను పాటించడం ద్వారా సేవకులు తమ వ్యక్తిగత ఇష్టాలను పక్కనబెట్టి, పక్షపాత వైఖరి లేకుండా సాధకుల మేలు కొరకు సామరస్య౦తో సమర్థవంతంగా శిబిరాలు జరగడానికి పనిచేయటం నేర్చుకుంటారు. సమస్యలు నిష్కపటంగా, వినయంతో పరిష్కరించబడాలి. సానుకూల, సకారత్మకమైన సలహాలు అన్నివేళలా ఆహ్వానించదగినవే.

సాధకులతో సంబంధాలు

అన్ని సందర్భాలలోనూ ధమ్మ సేవకులు, శిబిరంలో సాధన చేయడానికి వచ్చిన వారి సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.శిబిరంలో సాధకులే అతి ముఖ్యమైన పని చేస్తున్న ముఖ్య వ్యక్తులు. శిబిరాలు, ఈ ధ్యాన కేంద్రాలు వారి కోసమే. ధమ్మ సేవకుల పనల్లా, అన్ని విధాల సాధకులకు వీలైనంత సహాయపడటమే. అందువల్ల ఆహార విషయంలోగాని, నివాసవసతుల విషయంలోగాని సాధకులకే ప్రాధాన్యత ఇవ్వాలి. అత్యవసరంగా చేయాల్సిన పనులు ఉంటే తప్ప, సాధకులకు భోజనం అందించబడే వరకు, ధమ్మ సేవకులు ఆహారం తీసుకోకూడదు. భోజనశాలలో ఎంతమాత్రమూ సాధకులతో కలిసి భోజనం చేయకూడదు. సాధకులు స్నానం చేసేవేళల్లో స్నానపుగదుల్లొ స్నానం చేయటం, బట్టలు ఉతకడం వంటివి చేయకూడదు. సాధకులంతా విశ్రమించిన తరువాతనే ధమ్మ సేవకులు విశ్రమించాలి. ఎందుకంటే, ఏ సమయంలోనైనా, సమస్య తలెత్తే అవకాశం ఉంది. మిగతా అన్ని వసతుల వినియోగ విషయంలో కూడా సాధకులకే ప్రాధాన్యతనివ్వవలసి వుంటుంది. ధర్మ సేవకులెప్పుడూ సాధకుల సాధనకు ఎటువంటి అవాంతరమూ కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధకులతో వ్యవహరణ

శిబిర నిర్వాహకులు మాత్రమే సాధకులతో నేరుగా సంప్రదించవచ్చు - పురుష నిర్వాహకులు, పురుష సాధకులను; స్త్రీ నిర్వాహకులు, స్త్రీ సాధకులను మాత్రమే సంప్రదించవచ్చు. సాధకులు క్రమశిక్షణను, కాల పట్టికను పాటిస్తున్నారో లేదో చూస్తూ ఉండాలి. అలా పాటించకుండా ఉంటె, వారితో మాట్లాడాలి. కాని ఈ పనిని, అన్ని వేళల స్నేహ పూర్వకంగా, కరుణతో, సాధకులకు వారి సమస్యలను అదిగమించేందుకు ప్రోత్సహించాలి అనే సంకల్పంతో చేయాలి. మాట్లాడే పదాలను జాగ్రత్తగా, సానుకూలంగా వాడాలి - ఎప్పుడూ కఠినంగా మాట్లాడకూడదు. ఒక వేళ మనం అలా చేయ లేక పోతే, సహా సేవకుల సహకారంతో ఆ పరిస్థితిని చక్కదిద్దవచ్చు. ఎవరి ప్రవర్తనైనా సరిగా లేనట్లు కనిపిస్తే, కారణాలు ఊహించకోకుండా, నిర్వాహకులు దాని గురించి వివరాలు కనుక్కోవాలి.

ధమ్మ సాధకులు అందరు మార్యద పూర్వకంగా, వినయంగా ఉండాలి. సహాయం అవసరమైనప్పుడు అందుబాటులోఉండాలి. సాధారణంగా సాధకుల పేర్లు తెలుసుకొని ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది. సాధకులు ఎదుర్కుంటున్న సమస్యను బట్టి వారిని శిబిరా నిర్వాహకులను కాని, సహాయక ఆచార్యులను కాని కలవమని సూచించాలి. ఈ పనిని వీలైనంత తక్కువ మాటలతో, సాధకుల ధ్యానానికి భంగం కలగకుండా చేయాలి. ధ్యానంకు సంబంధించిన సాధకుల ప్రశ్నలకు, ధమ్మ సేవకులు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. అటువంటి ప్రశ్నలను సహాయక ఆచార్యులను అడగమని సూచించాలి. సాధకుల వ్యక్తిగత విషయాలను వంట గదిలో కాని, మరియే ఇతర ప్రదేశాలలోగాని, ఇతరులతో అనవసరంగా చర్చించకూడదు.

ధమ్మ సేవకుల ధ్యాన సాధన

ధమ్మ సేవకులు మనఃస్సాక్షిగా, సమయం వృధా చేయ కుండా, వారు చేస్తున్న పని పట్ల పూర్తి శ్రద్ధతో సేవ చేయాలి; ఇదే వారి శిక్షణ. దానితో పాటు ధ్యాన అభ్యసమును కొనసాగించాలి. సేవకులు ప్రతి రోజు కనీసం మూడు గంటలు ధ్యానం చేయాలి. వీలైతే ఈ ధ్యానం సాముహిక ధ్యాన సమయాలలో - ఉదయం 8, మధ్యాహ్నం 2:30, సాయంత్రం 6 గం||లకు చేయాలి. అదనంగా సేవకుల కోసం రాత్రి 9 గం||లకు ధమ్మ హాల్లో, సహాయక ఆచార్యుల సమక్షంలో చిన్న ధ్యాన సమావేశం ఉంటుంది. ఈ ధ్యాన సమయాలు, ధమ్మ సేవకుల సంక్షేమం కోసం అవసరమైనవి. సేవకులు శిబిరంలో విపశ్యన సాధన చేయాలి, అవసరమైతే ఆనాపాన చేయవచ్చు. ధమ్మ సేవకులు, సాముహిక ధ్యాన సమయంలో అవసరం అయితే వారి భంగిమ మార్చు కోవచ్చు.

ధమ్మ సేవకులకు అన్ని సమయాలలో తమని తాము పరిశీలించు కోవలిసిన బాధ్యత ఉంది. వారు అన్ని పరిస్థితులలో సమతుల్యంగా ఉండటానికి మరియు తమ మానసిక చేతన పట్ల జాగురుకతతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలసట లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా అలా చేయ లేక పోతే, వారు ధ్యానం చేయాలి లేదా మరింత విశ్రాంతి తీసుకోవాలి - ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే. సేవకులు తమ పని అనివార్యం అని, తాము లేక పోతే పని జరగదని ఊహించు కోకూడదు. తమ మనస్సులో శాంతి, సామరస్యాలు ఉన్నప్పుడే ఎవరైనా సరైన ధమ్మ సేవ చేయగలరు. పునాది సానుకూలంగా లేకపోతే, వారు చేసే పని నిజంగా ఉపయోగకరంగా ఉండదు. కేంద్రంలో దీర్ఘ కాలం ఉంటున్న సేవకులు, వారు చేస్తున్న పని అంతా ప్రక్కన పెట్టి, అప్పుడప్పుడు 10 రోజుల శిబిరం చేయాలి. వారు ధమ్మ సేవకులు అయినంత మాత్రాన ఏ ప్రత్యేక ప్రాధ్యనతను, సౌకర్యాన్ని ఆశించకూడదు.

సహాయక ఆచార్యులను కలవటం

ఏదైనా సమస్య గానీ ఇబ్బంది గానీ ఎదురైనప్పుడు ధమ్మ సేవకులు సహాయక ఆచార్యులు లేదా ఆచార్యులతో చర్చించాలి. ధమ్మ సేవకులు సేవకు సంబంధించి గానీ సాధరణ విషయాల గురించి కానీ ఏదైనా ప్రశ్నలు అడగాలంటే, ధమ్మహలులో రాత్రి 9:గ౦టల తర్వాత సమయం అనువైనది. వ్యక్తిగతమైనవి కూడా అడగవచ్చు. సహాయక ఆచార్యులు అక్కడ లేనప్పుడు ఏదైనా సందేహం వున్నా, ఇబ్బందివున్నా కేంద్ర నిర్వాహకులను అడగాలి.

స్త్రీ పురుషుల వేర్పాటు

స్త్రీ, పురుషులు విడివిడిగా ఉండటం అన్నది శిబిరంలు జరుగుతునప్పుడు మరియు శిబిరాల మధ్య కాలంలో కూడా ధమ్మ సేవకులకు వర్తిస్తుంది. ధమ్మ సేవకులు కలసిమెలసి పనిచేయాల్సిన వాతావరణంలో స్త్రీ, పురుష వేర్పాటు పూర్తిగా ఆచరణాత్మకం కాకపోవచ్చు. ఇది ధమ్మ సేవ ఇవ్వడానికి మాత్రమే. అవసరానికి మించి సంబంధాలను పెంచుకోవడాని అవకాశమని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందరికన్నా దంపతులకు ఇది చాలా ముఖ్యమైన నియమం.

శారీరక స్పర్శ

స్వచ్ఛమైన ధ్యాన వాతావరణాన్ని, అంతఃపరిశీలనా స్వభావం గల సాధనను పరిరక్షించుకోవటం కోసం మరియు సాధకులకు ఒక మంచి ఉదాహరణగా నిలవటానికి, ధమ్మ సేవకులందరు సాధకులతోను, ఇతర స్త్రీ, పురుష సేవకులెవ్వరి తోటి శారీరక స్పర్శ లేకుండా చూసుకోవాలి. శిబిరాలు జరుగుతునప్పుడు, శిబిరాల మధ్య (శిబిరాల జరగనప్పుడు) కూడా ఈ నియమం పాటించాలి.

ఆర్య వాక్కు

సాధకుల యొక్క ఆర్య మౌనంను ధమ్మ సేవకులు గౌరవించలి. ధమ్మ సేవకులు ధ్యాన శిబిర ఆవారణ లోపల మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అవసరం అయినప్పుడే మాట్లాడాలి. సాధకులకు వినపడేటంత దూరంలో లేకున్నా కూడా, ఏ శిబిరము జరుగక పోతున్నా కూడా అనవసరంగా నిశబ్ద భంగం చేయకుండా ఉండటం ముఖ్యం.

మాట్లాడుతునప్పుడు ధమ్మ సేవకులు సమ్యక్ వాక్కును అభ్యసించాలి. అంటే:

  • అబద్ధాలు చెప్పటం కాని, సత్యం కానిది ఏదైనా చెప్పటం కాని చేయకూడదు.
  • కటువైన భాష గాని, మొరటు మాటలు గాని మాట్లాడకూడదు. ధర్మాన్ని ఆచరించే వారెప్పుడు వినయంగా, మృదు భాషిగా ఉండాలి
  • అపనిందులు వేయటం, చాడీలు చెప్పటం లాంటివి చేయకూడదు. తమలో ఉత్పన్నమయ్యే ప్రతికూల భావనల కారణంగా ఇతరులను విమర్శించడం లాంటివి చేయకూడదు. ఏదైనా సమస్య ఉంటే, సంబంధిత వ్యక్తి దృష్టికి తీసుకురావటమో; సహయాక ఆచార్యుల లేక శిబిర నిర్వాహకుల దృష్టికి తీసుకురావటమో చేయాలి.
  • ఊసుపోని కబుర్లు, పాటలు పాతడం, ఈలలు వేయటం, కూని రాగాలు తీయటం వంటివి చేయకూడదు.

ఆర్య వాక్కు పాటించడం అనేది, ఆర్య మౌనం పాటించటం కన్నా చాలా కష్టతరమైన విషయం అనేదానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకని, ధమ్మ మార్గాన్ని అనుసరించే వారికెవరికైనా ఇది చాల ముఖ్య ప్రశిక్షణ.

ధమ్మ సేవకుల వస్త్ర ధారణ

ఇతరుల దృష్టిలో ధర్మ సేవకులు ధర్మబోధనకూ, ధ్యాన కేంద్రానికీ ప్రతినిధులుగా కనిపిస్తారు. అందుచేత సేవకులు ఎప్పుడూ చక్కగా, పరిశుభ్రంగా కనబడాలి. సాధారణ దుస్తులు ధరించాలి. అంతేకానీ సాధకులను ఆకర్షించి, వారి దృష్టిని మళ్ళింపచేసే, సాధనను భంగపరిచే ఆకర్షణీయమైన దుస్తుల్ని (అంటే పొట్టి దుస్తులు, బిగుతైన పాంట్లు, చేతులేని, కురుచైన షర్ట్స్) ధరించరాదు. నగలు వీలైనంత తక్కువగా, లేదా అసలు ధరించరాదు. ఈ వినయంతో కూడిన వైఖరి అన్ని వేళలా ఉండాలి.

ధూమపానం

ధమ్మను పాటించేవారు మద్యం, హషీష్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇక ఏమాత్రం వాడారని భావించడమైనది. గదుల లోపల, బయట; ధ్యాన కేంద్ర పరిసరాలలో, ధ్యాన కేంద్రం బయట పొగాకు ఏ రూపంలోనైనా వాడటం నిషిద్ధం. ధమ్మ సేవకులు కూడా పొగ త్రాగడం కోసం కేంద్ర పరిసరాలు వదిలి వెళ్ళరాదు.

ఆహారం

ఎటువంటి ఆహార సిద్ధాంతాలకు సంబంధం లేకుండా, శిబిరంలో సాధారణ, పరిపూర్ణ శాఖాహార భోజనం ఇవ్వబడుతుంది. ధమ్మ సేవకులు కూడా, సాధకుల లాగానే, వారికి ఇవ్వబడిన దానినే పరిత్యాగ భావంతో స్వీకరించాలి.

శిబిరంలో తయారు చేసి, వడ్డించే భోజనం పూర్తిగా శాఖాహారం. అందువలన మద్యం లేదా లిక్కర్, గుడ్లు లేదా గుడ్లు ఉన్న ఆహరం, జున్ను లేదా జంతు సంబంధ ఉత్పతులతో చేసిన ఆహరం శిబిరానికి తీసుకు రాకూడదు. సాధారణంగా బయటి ఆహారం తీసుకురావడం అత్యంత అల్పంగా ఉండాలి.

సేవకులు పంచ శీలాలను పాటించాలి. వారు కావాలనుకుంటే సాయంత్రం భోజనం చేయవచ్చు. ఉపవాసానికి అనుమతిలేదు.

చదువుట

ప్రస్తుతం బయటి ప్రపంచంలో జరుగుతున్న ఘటనలను తెలుసుకోవాలనుకునే ధమ్మ సేవకులు వార్త పత్రికలు, వార్త పుస్తకాలు చదువుకోవచ్చు. కాని వాటికి కేటాయించిన స్థలాలో మాత్రమే, సాధకుల దృష్టిలో పడకుండా చదువుకోవాలి. ఎవరైనా దిన పత్రికలు మాత్రమే కాకుండా ఏవైనా ఇతర పుస్తకాలు చదవాలనుకుంటే వారు ధమ్మ గ్రంథాలయంలో నున్న పుస్తకాలు చదువుకోవచ్చు. నవలలు లేదా వినోదం కోసం ఇతర పుస్తకాలు అనుమతింపబడవు.

బయటి ప్రపంచంతో సంప్రదింపులు

సాధకులు, బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేకుండా ఉండనవసరం లేదు. కాని శిబిరంలో సేవ చేస్తునప్పుడు, అత్యవసరం అయినప్పుడు, సహాయక ఆచార్యుల అనుమతితో శిబిరం విడిచి వెల్లవచ్చు. ఫోన్ కాల్స్ కూడా కట్టడి చేయాలి. వ్యక్తిగత సందర్శకులు నిర్వాహకుల ముందస్తు అనుమతితో మాత్రమే కేంద్రానికి రావచ్చు.

కేంద్రాన్నిపరిశుభ్ర౦ గా ఉంచడం.

ధ్యాన కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ధమ్మ సేవకులదే. భోజనశాల, పాకశాలయే కాకుండా నివాస స్థలాల్నీ, ధమ్మ హాలుని, స్నానపు గదులను, మూత్రశాలలను, ఆఫీసును ఇంకా ఇతర స్థలాలను కూడా సాధ్యమైనంత పరిశుభ్రంగా ఉంచాలి. అవసరమైతే, సేవకులు భోజన తయారీ మరియు పరిశుభ్రత సేవాలనే కాకుండా, ఇతర సేవలను అందించడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

ధ్యాన కేంద్ర సంపదను ఉపయోగించటం

ప్రతి విపశ్యనా సాధకుడు దొంగతనం చేయననీ,ఇవ్వని వస్తువు ఏదీ తీసుకోనని ప్రమాణం చేస్తాడు. ధమ్మ సేవకులు ధ్యానకేంద్రానికి సంబ౦ధించిన ఏ వస్తువునూ నిర్వాహకుల అనుమతి లేనిదే తమ నివాసస్థలాలకు తీసుకుని వెళ్లడమో, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవడమో చేయరాదు.

దీర్ఘ కాలం కేంద్రాలలో ఉండటం

గంభీర సాధన చేసే సాధకులు, ధమ్మ సైద్ధాంతిక ఙ్ఞానం మరియు అభ్యాసంలో మరింత స్థిర పడటానికి, సహాయకుల ఆచార్యుల అంగీకారంతో, కేంద్రంలో దీర్ఘ కాలం ఉండవచ్చు. అలంటి సందర్భాలలో ఆచార్యులతో, నిర్వాహుకులతో చర్చించి కొన్ని శిబిరాలలో సాధన, కొన్ని శిబిరాలలో సేవ చేయవచ్చు.

దానం

సాధకుల శిక్షణ నియమావళి ప్రకారం - శిబిరాల్లో పాల్గొనే సాధకుల నుంచీ - బోధనకు కానీ, భోజన వసతి సదుపాయాలకు కానీ, ఇతర వసతుల్ని కల్పించినందుకు కానీ - ఎటువంటి శిక్షణారుసుం తీసుకోవటం జరగదు. ఇదే ధర్మ సేవకులకు కూడా వర్తిస్తుంది.

స్వచ్ఛమైన ధర్మము ఎల్లప్పుడూ ఉచితంగానే అందించబడాలి. పాత సాధకులు ఇచ్చే దానం వల్లనే భోజనం, వసతి, ఇతర సదుపాయాలు సాధకులకు కల్పించ బడుతున్నాయి. ధర్మ సేవకులు దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సేవ చేసేటప్పుడు, దాతలిచ్చిన విరాళాలు వృథాకాకుండా, వీలైనంత ఎక్కువగా ప్రయోజనం కలిగేటట్లు చూడాలి. అలాగే సేవ చేస్తూ మీ దాన పుణ్యాన్ని పెంచుకోండి. అలాగే ధమ్మ సేవకులు కూడా తమ స్తోమతను బట్టి దానం చేయటం వాళ్ళ వారి దాన పారమితను పెంచోకోవచ్చు. శిబిరాలూ, ధ్యాన కేంద్రాలూ కేవలం ఉదాత్త సాధకుల దానం వల్లనే నడుస్తున్నాయి.

ఏ ఒక్కరు ధనరూపేణా, వస్తు రూపేణా తమ కొరకు తాము చెల్లించరు. ప్రతి దానము మరొకరి మేలు కొరకే. తన నివాస, భోజన వసతికి ప్రతిగా చెల్లించడానికి ధర్మ సేవ ఒక మార్గం కూడా కాదు. సేవ ఇచ్చేది తమ మేలు కొరకే. ఎందుకంటే ధమ్మ మార్గంలో ఇంకా ఎంతో గొప్పదైన శిక్షణ పొందుతారు కనుక. ధ్యాన కేంద్రాలు ధ్యాన సాధన చేయటానికి మాత్రమే కాక ధమ్మ సేవ ద్వారా ఇతరులతో కరుణ, వినయాలతో మెలగడంను సాధన చేయటానికి కూడా అవకాసం కల్పిస్తాయి.

ముగింపు

ధమ్మ సేవకులు సహాయక ఆచార్యుల, శిబిర నిర్వాహకుల మార్గదర్శకత్వం ప్రకారం సేవ చేయాలి. సాధకులకు అంతరాయం కలిగించకుండా, వారికి సహాయ పడటానికి, ధమ్మ సేవకులు చేయగలిగినదంతా చేయాలి. ధమ్మంపై సందేహాలు ఉన్నవారిలో నమ్మకంను ప్రేరేపించే విధంగానూ మరియు నమ్మకం ఉన్న వారిలో విశ్వాసం మరింత పెరిగే విధంగానూ ధమ్మ సేవకుల ప్రవర్తన ఉండాలి. సేవ యొక్క లక్ష్యం ఇతరులకు సహాయం చేయడం, తద్వారా తమకు తాము సహాయం చేసుకోవడం అని ధమ్మ సేవకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి .

ఈ నియమాలు మీకు ఏ విధంగానైనా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, దయచేసి సహాయక ఆచార్యులను కాని, నిర్వాహకులను కాని కలిసి వివరణ కోరండి.

మీ సేవ, ధమ్మ మార్గంలో ప్రగతి సాధించడానికి, అన్ని భాదల నుండి విముక్తి పొందటానికి, ముక్తి పొందటానికి, నిజమైన ఆనందం పొందటానికి సహాయ పడుగాక.

అన్ని జీవులు ఆనందంగా ఉండు గాక!


పూజ్య గురూజీ శ్రీ సత్యనారాయణ గోయెంకా గారు ధమ్మ సేవ విలువ గురించి ఇచ్చిన ఒక సందేశం

మీరు దైనందిత జీవితంలో ధమ్మను ఎలా వర్తింప చేయవచ్చో సేవ చేస్తునప్పుడు, నేర్చుకుంటారు. ముఖ్యంగా ధమ్మను పాటిచడం అంటే, దైనందిత భాద్యతల నుండి పారిపోవటం కాదు అని అర్థం చేసుకుంటారు. ధ్యాన శిబిరం వంటి చిన్న ప్రపంచంలో సాధకులతో ధమ్మ ప్రకారం వ్యవహరించడం నేర్చుకోవడం ద్వార, బయటి ప్రపంచంలో ధమ్మ ప్రకారం ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు. అవాంఛనీయమైన పరిస్థితులు ఎదురైనప్పటికి, మీరు మీ మనస్సును సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నము చేస్తూ, ఇతరుల పట్ల ప్రేమ, కరుణను జాగృతం చేస్తారు. ఈ విషయంలో నైపుణ్యత సాధించడానికే మీరిక్కడ ప్రయత్నం చేస్తుంటారు. మీరు కూడా ఇక్కడ సాధన చేస్తున్న సాధకుల వంటి వారే.

ఇతరులకు వినయంగా సేవ చేయడం ద్వార నేర్చుకుంటూ ఉండండి. "నేను ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, ఇతరులకు సేవ చేయడం ఎలాగో నేర్చుకునే శిక్షణలో ఉన్నాను. ఇతరులు ధమ్మ నుండి లాభాలను పొందాలనే ఉద్దేశ్యంతోనే నేను పని చేస్తున్నాను. ఒక మంచి ఉదాహరణగా నిలవటం ద్వారా నేను వారికి సహాయం చేస్తాను. అలాచేస్తూ నాకు నేను సహాయం చేసుకుంటాను" అని అనుకుంటూ ఉండాలి.

ధర్మ సేవ ఇచ్చే మీ అందరు ధమ్మలో ధృడవంతులు అగుదురుగాక! ఇతరుల పట్ల మైత్రి, ప్రేమ, కరుణలను అభివృద్ధి చేసుకుందురు గాక! మీరందరు ధర్మ మార్గంలో పురోగతి పొందుతూ నిజమైన శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని పొందుదురు గాక!

శ్రీ గోయెంక గారు