గోప్యతా విధానం

Dhamma.org cares about your privacy. As new data protection regulations come into effect around the world, including the GDPR in the European Union, we have taken the opportunity to make improvements for the benefit of all Dhamma.org users. Specifically, we have updated our Privacy Policy as of May 25, 2018. We appreciate your patience while we are working on translating the updates. In the meantime please consult the Privacy Policy in English for the latest revision. Thank you.

విపశ్యన వెబ్ సైటును సందర్శించినందుకు ధన్యవాదములు. మీ గోప్యత మా సంస్థలకు ముఖ్యం. మీ గోప్యతను చక్కగా పరిరక్షించడానికి, మేము మా సమాచార పద్దతులను వివరిస్తున్నాము. మరియు మా సైట్స్, మా సంబంధిత సంస్థలలో మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తామో, ఎలా ఉపయోగిస్తామో మీరు తప్పక తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ గమనికను అందిస్తున్నాము. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా సంస్థల గోప్యతా విధానాల నిర్దిష్ట వివరాలు వేరు వేరు దేశాలలో వేరువేరుగా ఉండవచ్చు. మీ సమాచారానికి సంబందించిన, నిర్దిష్ట గోప్యతా విధాన నకలు ప్రతిని, విపశ్యన శిబిర రిజిస్ట్రార్ నుండి లేదా శిబిర కేంద్రము వద్దకు చేరాక మీరు పొందవచ్చు.

మేము సేకరించే సమాచారం

మీరు మా ఆన్ లైన్ ద్వారా లేదా సంప్రదాయ దరఖాస్తు ద్వారా విపశ్యన ధ్యాన శిబిరం కోసం నమోదు చేసుకోదలిస్తే మీ వ్యక్తిగత సమాచారం దరఖాస్తు పత్రం ద్వార మేము సేకరిస్తాము. ఈ సమాచారంలో పేరు, చిరునామా, ఇమెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబర్, ఫాక్స్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఉండవచ్చు. శిబిర దరఖాస్తు పత్రం లేదా నమోదు పత్రం లో ఉన్న మీ వ్యక్తిగత సమాచారం మా ఆధీనంలోని వ్యవస్థలలో సురక్షితంగా భద్రపరచ బడుతుంది. ఈ సమాచారం చూడటానికి "తెలుసుకోవాలి అనే అవసరం ఉన్న" మీరు ప్రవేశం కోరే శిబిర రిజిస్ట్రార్, కేంద్ర/ శిబిరా నిర్వాహకులు, సహాయక ఆచార్యులు, శిబిర ఆచార్యులు వంటి వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

మీరు మా "విపశ్యన గురించి ఒక స్నేహితునికి చెప్పండి" అనే సదుపాయం ఉపయోగించుకోదలిస్తే, మీరు తప్పనిసరిగా మీ ఇద్దరి వ్యక్తిగత ఈ మెయిల్ చిరునామాలను మాకు అందించ వలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వార మేము వారికి వ్యక్తిగత శుభాకాంక్షలు, మా వెబ్ సైట్ చిరునామాతో వారికి పంపుతాము. ఈ సేవ ద్వార మేము మిమ్మల్ని మరియు మీరు సూచించిన ఇతర వ్యక్తిని వ్యక్తిగతంగా గుర్తించ గలిగే ఈ మెయిల్ చిరునామాలు మాత్రమే సేకరిస్తాము. ఇవి కాక మీరు మా వెబ్ సైట్ సందర్శించినప్పుడు, వ్యక్తిగతం కాని సమాచారం - అంటే మీరు ఉపయోగిస్తున్న బ్రౌజరు (ఉదా|| ఫైరుఫాక్సు, నెట్స్కేప్, ఓపెరా లేదా ఇంటర్నెట్ ఎక్స్ ప్లొరర్), మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం (ఉదా|| విండోస్, మాక్ ఓస్ లేదా లినక్సు) మరియు మీకు ఇంటర్నెట్ సదుపాయం అందిస్తున్న వారి డొమైన్ పేరు (ఉదా|| అమెరికా ఆన్లైన్, ఎర్త్ లింక్) వంటి సమాచారం కూడా మేము సేకరించవచ్చు.

మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము?

మీ దరఖాస్తు పత్రంలో మీ గురించి, మీరు అందించిన మీ సమాచారం, ఆ శిబిరంలో మీ ప్రవేశానికి మీ దరఖాస్తును విశ్లేషించడానికి మరియు శిబిరంలో నమోదుకు ఉపయోగిస్తాము. అంతేకాకుండా, ఎవరైతే విపశ్యన శిబిరాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారో, వారు తదుపరి శిబిరాలు కూడా వారి జీవిత కాలం లో హాజరు అవుతూ ఉంటారని మేము గమనించాము. తదుపరి శిబిరాలలో ప్రవేశం సులభతరం చేయడానికి, మరియు సాధకుల చరిత్ర మరియు అనుభవం భద్రపరచడం కొరకు, మేము ప్రతి సాధకుని శిబిర సమాచారం, చట్టపరమైన నిషేధం ఏది లేకుంటే నిరవధికంగా భద్ర పరచవచ్చు. కొన్ని సార్లు మేము మీ పేరు, చిరునామా లేదా ఈ మెయిల్ చిరునామాను, విపశ్యన సంబంధించిన కార్యక్రమాలు గురించి, వసతుల గురించిన సమాచారం మీకు పంపడానికి మేము ఉపయోగించవచ్చు. "ఒక స్నేహితునికి చెప్పండి" సదుపాయం ద్వార మీరు అందించిన సమాచారాన్ని, వారికి శుభాకాంక్షలు మరియు మా వెబ్ సైట్ వివరాలు పంపడానికి ఉపయోగిస్తాము. కొన్ని సార్లు, మా వెబ్ సైట్ నమూనా, అందులోని విషయాలు మెరుగు పరచడానికి, మా వెబ్ సైట్ ద్వార వ్యక్తిగతం కాని వివరాలు ఉపయోగించవచ్చు. ఈ వివరాలు మాకు, మా సైటును ఎవరు, ఏ ప్రాంతం నుండి చూస్తున్నారు మరియు సైటులో ఎటువంటి పేజిలు చూస్తున్నారు అనే విషయాలు విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. విపశ్యన వెబ్ సైట్ ఎప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు లేదా వ్యాపార లక్ష్యాల కోసం లేదా ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయొగించదు. అయితే కొన్ని ప్రాంతీయ వెబ్ సైట్లలో మా సంస్థ క్రెడిట్ కార్డు ఆధార విరాళాలు స్వీకరించవచ్చు. అటువంటి సందర్భాలలో ఆ విరాళాలకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం సాధారణ పద్ధతిలోనే ప్రాసెస్ చేయబడుతాయి. అంతే తప్ప మీ వ్యక్తిగత సమాచారం మా సంస్థ గాని, దాని అనుబంధ సంస్థలు గాని బయటకు బహిర్గతం చేయవు, న్యాయ పరంగా అలా అవసరం అయితే తప్ప- అంటే న్యాయస్థానం ఆదేశిస్తేనో లేదా చట్టం అమలు పరిచే సంస్థ అభ్యర్థనకు ప్రతిస్పందనగానో లేదా ఇతర చట్టపరమైన అవసరాల కోమో మీ సమాచారం తెలియ చేయబడవచ్చు.

"తెలుసుకోవాల్సిన అవసరం" విపశ్యన ఆచార్యులకు, సహాయక ఆచార్యులకు అలాగే ధ్యాన కేంద్రాల సిబ్బందికి మరియు ధమ్మ సేవకులకు మాత్రమే, మీ శిబిర దరఖాస్తు లేదా నమోదు పత్రాలలో ఉన్న మీ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇటువంటి సమాచారం ఒకసారి మీరు సమర్పించిన కేంద్రం లేదా కేంద్రం కాని శిబిర రిజిస్ట్రారుకు చేరిన వెంటనే ఆ సమాచారం, ఇంకెవరికి తెలియకుండా ఉండే విధంగా పరిరక్షింప బడుతుంది. కాని, మీరు నమోదు చేసుకున్న శిబిరం ఉన్న దేశపు నిర్దిష్ట గోప్యతా విధానాలను బట్టి, మీ సమాచార నిల్వ, సంరక్షణ మరియు ఉపయోగం నిర్దేశించ బడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ-మెయిల్ సదుపాయాలు అంత సురక్షితంగా ఉండక పోవడం వల్ల, మీరు సమర్పించిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా పంపబడటం వల్ల బహిర్గతం అయ్యే ఒక ప్రమాదం ఉంది. మీరు వ్యక్తిగతంగా ఈ ప్రమాదానికి సిద్దం అయితే తప్ప, ఈ వెబ్ సైట్ ద్వార ఈ-మెయిల్ సదుపాయం దయచేసి ఉపయోగించ వద్దు.

దరఖాస్తు పత్రాలు మరియు అందులో ఉన్న వ్యక్తిగత సమాచారం మా కంప్యూటర్లలో నిల్వ చేయబడి, భద్రపరచబడుతాయి. అంతే కాకుండా మా కంప్యూటర్లు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నాయి. మా శిబిరాలలో ఒక శిబిరం హాజరు కావడానికి, మీరు దరఖాస్తు సమర్పించడం ద్వారా, మీ దరఖాస్తు పత్రాన్ని మా కంప్యూటర్లలో భద్రపరచడానికి, ప్రాసెస్ చేయడానికి మరియు సీమాంతరాలకు దరఖాస్తు పత్రంలో ఉన్న మీ వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడానికి మీ నిస్సందేహ సమ్మతి తెలియజేస్తున్నారు. అలాగే నమోదు ప్రక్రియలో మీరు సమర్పించిన సమాచార నిల్వ మరియు నిర్వహణ స్థానిక న్యాయపరిధిలోని గోప్యతా నియంత్రణలకు అనుగుణంగా ఉంటుంది. అంతే కాకుండా, కొన్ని సందర్భాలలో మీరు దరఖాస్తు సమర్పించిన కేంద్రం యొక్క ఈమెయిలు సదుపాయం గూగుల్ యప్స్ ద్వార అందించబడి ఉండవచ్చు. దాని ఫలితంగా, ఆ కేంద్రానికి సమర్పించిన మీ దరఖాస్తు పత్రంలోని సమాచారం గూగుల్ గోప్యత మరియు భద్రత నియమాలకు అనుగుణంగా వ్యవహరించ బడుతుంది. సాధకుల సంక్షేమం కొరకు వారి ఆరోగ్య సమస్యలు లేదా క్రమశిక్షణ నియమావళికి విరుద్ధంగా ఉన్న వారి ప్రవర్తన లేదా భవిష్యత్ లో పాల్గోనకూడని లేదా అదనపు సహాయం అవసరమైయ్యె సాధకుల గురించి సూచనలను మేము తీసుకొని భద్ర పరచ వచ్చు. ఇలా అరుదుగా జరిగే సందర్భాలలో, ఇలా భద్ర పరచిన సూచనలను భవిష్యత్తు శిబిరాలలో, సహాయక ఆచార్యులు లేదా శిబిరా నిర్వాహకులకు గోప్యంగా అందించవచ్చు. మీ శిబిర హాజరు అటువంటి సూచనలను భద్ర పరచడానికి మరియు సీమంతరలాకు బదిలీ చేయడానికి మీ నిస్సందేహ సమ్మతిని తెలియ చేస్తుంది.

ఇతర సంస్థల సైట్ల ద్వారా సమాచార సేకరణ

ఈ గోప్యత విధానం, మేము మీ నుండి సేకరించిన సమాచారం యొక్క ఉపయోగం మరియు వ్యాప్తిని గురించి మాత్రమే వివరిస్తుంది. మా వెబ్ సైట్లో, ఇతర వెబ్ సైట్స్ లింక్స్ ఉండవచ్చు. ఆ సైట్స్ యొక్క సమాచార అభ్యాసాలు, మా అభ్యాసాల నుండి భిన్నంగా ఉండవచ్చు. సందర్శకులు ఆ సైట్స్ యొక్క గోప్యతా విధానాలను తప్పక చూడాలి. ఎందుకంటే ఆ సైటులు మా వద్ద నుండి సేకరించే సమాచారము మీద కాని, మేము వారికిచ్చే సమాచారము మీద కాని మా నియంత్రణ ఉండదు. విపశ్యన సంస్థ ఇతర వెబ్ సైటుల గోప్యతా విధానాలను నియత్రించదు కాబట్టి మీరు ఆ గోప్యతా ఆచారాలు మరియు విధానాలు ఏవైనా ఉంటె, వాటికి లోబడి ఉంటారు. మరియు ఆ సంస్థ ద్వారా ఆ సైటులు లోని మీ వ్యక్తిగత సమాచారం ఉపయోగంకు లేదా వ్యాప్తికి మేము ఎటువంటి భాద్యత వహించము. అందువలన మేము మిమ్మల్ని, ఇతరులకు మీ వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేసే ముందు ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తాము.

కుకీలు (Cookies)

"కుకీ" అంటే, మీరు మా వెబ్ సైట్ సందర్శించినప్పుడు, మా సర్వర్ నుండి మీ వ్యక్తిగత కంప్యూటర్కు డౌన్లోడ్ అయ్యే కొన్ని వివరాలు ఉన్న ఒక టెక్స్ట్ ఫైల్. ఈ ఫైల్లో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. మీరు మా శిబిరంకు నమోదు చేసుకోవడానికి మా వెబ్ సైట్ సందర్శించినప్పుడు ఇలాంటి కుకీ సృష్టిస్తాము. మీరు పాత సాధకులుగా సందర్సిస్తున్నారో లేదో తెలుసు కోవడానికి ఒక సెషన్ కుకీ సృష్టిస్తాము. కొన్ని కుకీలు మీరు మా వెబ్ సైట్ చూస్తున్నంత కాలం వరకే ఉంటాయి. ఇవి మీరు బ్రౌజరు మూసివేసినప్పుడు తొలగించబడుతాయి. మరి కొన్ని ప్రాంతీయ విపశ్యన వెబ్ సైట్లు కూడా కుకీలు ఉపయోగిస్తూ ఉండవచ్చు.

పిల్లల గోప్యత

మా విపశ్యన సంస్థలు ప్రత్యేకంగా పిల్లల గురించిన సమాచారాన్ని సేకరించవు, కానీ మేము పిల్లల భద్రత మరియు ఇంటర్నెట్ వాడకం పట్ల జాగ్రత్త వహిస్తాము.అందువలన, 1998 అమెరికా సంయుక్త రాష్ట్రాల బాలల ఆన్ లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం (మరియు ఇతర దేశాలలో దీనితో పోల్చదగిన చట్టం) ప్రకారం, మేము తల్లిదండ్రుల నిర్దిష్ట అంగీకారం లేకుండా 13 ఏళ్ళ లోపు వయస్సుగల పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ కూడా అభ్యర్తించము. ఒకవేళ అటువంటి అలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు మా దృష్టికి వచ్చినచో మేము వెనువెంటనే ఆ సమాచారాన్ని మా డేటాబేస్ నుండి తొలగిస్తాము.

నిర్దిష్ట దేశీయ గోప్యతా అవసరాలు

వివిధ దేశాలు, తమ తమ ప్రత్యేక గోప్యతా చట్టాలు కలిగి ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా విపశ్యన సంస్థలు, ఆయా దేశాల చట్టాల ప్రకారం నిర్దిష్ట గోప్యత విధానాలు రూపొందించాయి. అవి నిర్దిష్ట వివరాలలో పైన పేర్కొన్న సాధారణ విధానాల నుండి భిన్నంగా ఉండవచ్చు . ఈ నిర్దిష్ట వివరాల ప్రతిని పొందటానికి మీరు దరఖాస్తు చేసుకున్న శిబిర రిజిస్ట్రార్ లేదా కేంద్రాన్ని సంప్రదించండి లేదా మీరు శిబిరాన్ని చేరిన తరువాత కూడా పొందవచ్చు.

Dhamma.org is committed to protecting the “rights and freedoms” of individuals whose information Dhamma.org collects in accordance with such laws including but not limited to the General Data Protection Regulation (GDPR).

Pursuant to the applicable privacy regulations, you may have the following rights, among others, with regard to any data we collect or retain that relates to you:

  • the right of access, i.e. the right to obtain confirmation as to whether or not personal data is being processed, and where this is the case, to obtain access thereto;
  • the right to rectification and erasure, i.e. the right to have inaccurate data rectified and/or to have incomplete data completed, and the right to have personal data erased for legitimate reasons;
  • the right to impose restrictions on the processing of personal data, i.e. the right to request the suspension of data processing for legitimate reasons;
  • the right to data portability, i.e. the right to receive the data in a structured, commonly-used and easily readable format, as well as the right to transmit the data to another data controller
  • the right to object, i.e. the right to oppose the processing of data where legitimate reasons for this exist, including data processed for marketing and profiling purposes, if this is envisaged;
  • the right to contact the competent data protection authority in case of unlawful data processing.

You may exercise the rights listed above by writing to dhamma.org at [email protected]. In addition to the foregoing rights, each application form to register for a Vipassana Meditation course or related activity contains a series of disclosures and consents, which are also intended to protect your rights.

ఎంపిక చేసుకోండి/ విరమించుకొండి

మీరు మీ మా విపశ్యన సంస్థలు, మా సేవలు లేదా విపశ్యన గురించిన సమాచారం గురించి పంపించే ఈ మెయిల్ లేదా ఉత్తరాల నుంచి విరమించుకొనే అవకాశం మేము అందిస్తున్నాము. మీరు మీ పేరు, ఈమెయిలు చిరునామా మరియు ఇతర వ్యక్తిగత సమాచారం మా డేటాబేస్ నుండి పూర్తిగా తొలగించాలి అని అనుకుంటే ఈ క్రింది ఈ మెయిల్ కు, ఈ మెయిల్ పంపండి : [email protected]. మీరు మీ ప్రాంతీయ విపశ్యన కేంద్రంను కూడా సంప్రదించవచ్చు.

మమ్మల్ని సంప్రదించడం ఎలా?

మీకు మా విపశ్యన వెబ్ సైట్ లేదా దాని గోప్యత అమలు గురించి లేదా మరి ఏ ఇతర విధానాల గురించైనా ప్రశ్నలు లేదా అనుమానాలు ఉంటే, మమ్మల్ని [email protected]. ద్వార సంప్రదించ వచ్చు.

అమలు పరిచే తేదీ

ఈ గోప్యతా విధానం నవంబర్ 1, 2001 నుండి అమలులో ఉంది. మా విపశ్యన సంస్థలకు ఏ సమయంలోనైనా మా స్వంత అభీష్టానుసారం ఈ విధానం యొక్క నిబంధనలను సవరించడానికి పూర్తి హక్కులు కలవు. ఈ వెబ్సైట్ ను మీరు ఉపయోగించడం ద్వారా పైన ప్రస్తావించిన విధానాలకు మీరు అంగీకారబద్ధులు అయినట్లు భావించబడుతుంది.