విపశ్యన
శ్రీ గోయెంక గారిచే భోదించబడిన
ధ్యానం
సాయజి ఉ బ ఖిన్ గారి సంప్రదాయంలో
పూజ్య గురూజీ శ్రీ సత్యనారాయణ గోయెంకా గారు ధమ్మ సేవ విలువ గురించి ఇచ్చిన ఒక సందేశం
మీరు దైనందిత జీవితంలో ధమ్మను ఎలా వర్తింప చేయవచ్చో సేవ చేస్తునప్పుడు, నేర్చుకుంటారు. ముఖ్యంగా ధమ్మను పాటిచడం అంటే, దైనందిత భాద్యతల నుండి పారిపోవటం కాదు అని అర్థం చేసుకుంటారు. ధ్యాన శిబిరం వంటి చిన్న ప్రపంచంలో సాధకులతో ధమ్మ ప్రకారం వ్యవహరించడం నేర్చుకోవడం ద్వార, బయటి ప్రపంచంలో ధమ్మ ప్రకారం ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు. అవాంఛనీయమైన పరిస్థితులు ఎదురైనప్పటికి, మీరు మీ మనస్సును సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నము చేస్తూ, ఇతరుల పట్ల ప్రేమ, కరుణను జాగృతం చేస్తారు. ఈ విషయంలో నైపుణ్యత సాధించడానికే మీరిక్కడ ప్రయత్నం చేస్తుంటారు. మీరు కూడా ఇక్కడ సాధన చేస్తున్న సాధకుల వంటి వారే.
ఇతరులకు వినయంగా సేవ చేయడం ద్వార నేర్చుకుంటూ ఉండండి. "నేను ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, ఇతరులకు సేవ చేయడం ఎలాగో నేర్చుకునే శిక్షణలో ఉన్నాను. ఇతరులు ధమ్మ నుండి లాభాలను పొందాలనే ఉద్దేశ్యంతోనే నేను పని చేస్తున్నాను. ఒక మంచి ఉదాహరణగా నిలవటం ద్వారా నేను వారికి సహాయం చేస్తాను. అలాచేస్తూ నాకు నేను సహాయం చేసుకుంటాను" అని అనుకుంటూ ఉండాలి.
ధర్మ సేవ ఇచ్చే మీ అందరు ధమ్మలో ధృడవంతులు అగుదురుగాక! ఇతరుల పట్ల మైత్రి, ప్రేమ, కరుణలను అభివృద్ధి చేసుకుందురు గాక! మీరందరు ధర్మ మార్గంలో పురోగతి పొందుతూ నిజమైన శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని పొందుదురు గాక!
శ్రీ గోయెంక గారు