విపశ్యన
శ్రీ గోయెంక గారిచే భోదించబడిన

ధ్యానం
సాయజి ఉ బ ఖిన్ గారి సంప్రదాయంలో
ప్రత్యేక శిబిర అర్హతలు
పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.
పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.
విపశ్యన ధ్యాన పద్ధతిలో పాత సాధకుల కొరకు చాలా ప్రత్యేక శిబిరంలు ఉన్నాయి. ఈ శిబిరంలలో ప్రవేశం పొందడానికి, పాత సాధకులు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ప్రాధమిక అర్హతలు క్రింద చెప్పబడినవి:
1-రోజు లేదా 3-రోజుల పాత సాధకుల శిబిరం
శ్రీ గోయెంకా గారితో గానీ లేకా వారి సహాయక ఆచార్యులతో గానీ కనీసం ఒక్క 10 రోజుల శిబిరములో సాధన చేసి ఉండాలి. శక్తి అనుపాతం ద్వారా స్వస్థత కలిగించే వారు పాల్గొనకూడదు. అన్ని శీలములను యథా శక్తి పాటిస్తూ ఉండాలి.
సతిపట్ఠాన సుత్త శిబిరం
సతిపట్ఠాన సుత్త పాత సాధకుల శిబిరం కోసం ఆవశ్యకతలు
- గోయెంక గారితో లేదా అతని సహాయక ఆచార్యులతో కనీసం 3 పది రోజుల శిబిరాలు పూర్తి చేసి ఉండాలి. ఇందులో సేవ చేసిన శిబిరాలు ఉండకూడదు
- గోయెంక గారు భోదించిన విపశ్యన ధ్యానమును కనీసము ఒక సంవత్సరం పాటు సాధన చేస్తూ ఉండాలి.
-
గోయెంక గారు లేదా అతని సహాయక ఆచార్యులతో మీరు చివరిసారిగా చేసిన శిబిరం నుండి మరి ఏ ఇతర ధ్యాన సాధన చేసి ఉండకూడదు.
-
కనీసము శిబిరం కోసం దరఖాస్తు చేసుకున్న సమయం నుండి పంచ శీల సూత్రాలను పాటిస్తూ ఉండాలి.
-
కనీసము శిబిరం కోసం దరఖాస్తు చేసుకున్న సమయం నుండి ప్రతి దినం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి.
గంభీర పాత సాధకుల కోసం స్వీయ శిబిరం
కనీసం మూడు 10 రోజుల శిబిరంలలో సాధన చేసి, ఆ మూడింటిలో ఆఖరు శిబిరం గత రెండు సంవత్సరములలోపు చేసి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే ఈ స్వీయ శిబిరాలు. ఇందులో ఆచార్యులు ఉండరు, సాధకుల నిర్వాహకులు ఉండరు, మధ్యాహ్నం ఆచార్యులతో ముఖాముఖి ఉండదు, రాత్రి ప్రశ్నోత్తరముల సమావేశం ఉండదు.సాయంత్రపు ప్రవచనాలు అవసరము కనుక సాయంత్రం 7 గం||లకు ప్రవచనాలను పెట్టి నిర్వహించుకొనే బాధ్యత హాజరవుతున్న సాధకులదే.
సాధకులు సాధారణ 10 రోజుల శిబిరంలోని కాల పట్టికనే అనుసరిస్తారు. ధ్యాన కేంద్రములో అన్ని నియమ నిబంధనలను (ఆర్య మౌనము, 8 శీలముల పాలన, మొదలైనవి) పాటించవలెను. గోయెంకగారితో లేక వారి సహాయక ఆచార్యులతో చేసిన ఆఖరు శిబిరం తరువాత మీరు ఇతర ధ్యాన పద్ధతులను అనుసరించి ఉండకూడదు. మీ ఆఖరి 10 రోజుల శిబిరం తరువాత నుండి ప్రతి రోజూ 2 గంటల దైనిక సాధన చేయటానికి కృషి చేస్తూ ఉండాలి. పంచ శీలాల పాలన తమ తమ సామర్థ్యానుసారంగా ఆచరించే ప్రయత్నము చేస్తూ ఉండాలి. స్వీయ శిబిరం చేయడానికి సహాయక ఆచార్యుని అనుమతి లభించి ఉండాలి.
పాత సాధకుల కోసం ప్రత్యేక 10 రోజుల శిబిరం
- ఈ పద్ధతికి కట్టుబడి ఉన్న గంభీరమైన పూర్వ సాధకులై ఉండాలి.
- శ్రీ గోయెంక గారు లేదా అతని సహాయక ఆచార్యులతో కనీసం ఐదు 10 పది రోజుల శిబిరాలు చేసి ఉండాలి.
- కనీసం ఒక సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి ఉండాలి.
- కనీసం ఒక 10 రోజుల శిబిరం సేవ చేసి ఉండాలి.
- 2 సంవత్సరాలుగా, రోజు 2 గంటల సాధన చేస్తూ ఉండాలి.
- కనీసం ఒక సంవత్సరం హత్య, లైంగిక దుష్ప్రవర్తన, మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ మరియు మిగతా సూత్రాలను ఎవరి సామర్థ్యం కొద్ది వారు పాటిస్తూ ఉండాలి.
- దీర్ఘ శిబిరంలో కూర్చుంటున్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాముల పూర్తి సహకారం ఉండాలి.
14-Day Gratitude Course
14-Day Gratitude Course Requirements are:
- Must be a serious old student who is active in giving Dhamma Service.
- Must be practicing Vipassana exclusively (not practicing any other meditation techniques).
- Must have sat at least one Satipaṭṭhāna Sutta course and three 10-Day courses.
- Must be trying to maintain the five precepts to the best of one’s ability.
- Must be trying to maintain two-hour daily practice since last 10-Day course.
- Must have local Teacher’s recommendation.
20-రోజుల శిబిరం
- ఈ పద్ధతికి కట్టుబడి ఉన్న గంభీరమైన పూర్వ సాధకులై ఉండాలి.
-
శ్రీ గోయెంక గారు లేదా అతని సహాయక ఆచార్యులతో కనీసం ఐదు 10 రోజుల శిబిరాలు చేసి ఉండాలి.
-
కనీసం ఒక సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి ఉండాలి.
-
కనీసం ఒక 10 రోజుల శిబిరం సేవ చేసి ఉండాలి.
-
2 సంవత్సరాలుగా, రోజు 2 గంటల సాధన చేస్తూ ఉండాలి.
-
కనీసం ఒక సంవత్సరం హత్య, లైంగిక దుష్ప్రవర్తన, మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ మరియు మిగతా సూత్రాలను ఎవరి సామర్థ్యం కొద్ది వారు పాటిస్తూ ఉండాలి.
-
చివరిసారిగా చేసిన దీర్ఘ శిబిరం నుండి కనీసం 6 నెలల వ్యవధి ఉండాలి.
-
దీర్ఘ శిబిరము మరియు ఇతర శిబిరం మధ్యలో 10 రోజుల వ్యవధి ఉండాలి.
-
దీర్ఘ శిబిరంలో కూర్చుంటున్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాముల పూర్తి సహకారం ఉండాలి.
30-రోజుల శిబిరం
- ఈ పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీరమైన పూర్వ సాధకులై ఉండాలి.
- శ్రీ గోయెంక గారు లేదా అతని సహాయక ఆచార్యులతో కనీసం ఆరు 10 రోజుల శిబిరాలలో సాధన చేసి ఉండాలి.
- కనీసం ఒక సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి ఉండాలి.
- కనీసం ఒక 20 రోజుల శిబిరం పూర్తి చేసి ఉండాలి
- కనీసం ఒక 10 రోజుల శిబిరం సేవ చేసి ఉండాలి.
- 2 సంవత్సరాలుగా, రోజు 2 గంటల సాధన చేస్తూ ఉండాలి.
- కనీసం ఒక సంవత్సరం హత్య, లైంగిక దుష్ప్రవర్తన, మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ మరియు మిగతా సూత్రాలను ఎవరి సామర్థ్యం కొద్ది వారు పాటిస్తూ ఉండాలి.
- చివరిసారిగా చేసిన దీర్ఘ శిబిరం నుండి కనీసం 6 నెలల వ్యవధి ఉండాలి.
- దీర్ఘ శిబిరము మరియు ఇతర శిబిరం మధ్యలో 10 రోజుల వ్యవధి ఉండాలి.
- దీర్ఘ శిబిరంలో కూర్చుంటున్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాముల పూర్తి సహకారం ఉండాలి.
- మొదటి 30 రోజుల శిబిరం కోసం, మొదటి 20 రోజుల శిబిరం తరువాత కనీసం ఒక సాధారణ 10 రోజుల శిబిరం పూర్తి చేసి ఉండాలి.
45-రోజుల శిబిరం
- ఈ పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీరమైన పూర్వ సాధకులై ఉండాలి.
- సహాయక ఆచార్యులకు మరియు ధమ్మ సేవలో లోతుగా నిమగ్నం అయిన వారికి పరిమితం.
- శ్రీ గోయెంక గారు లేదా అతని సహాయక ఆచార్యులతో కనీసం 7 పది రోజుల శిబిరాలు కూర్చొని ఉండాలి.
- కనీసం గత 3 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఈ పద్ధతినే సాధన చేసి ఉండాలి.
- కనీసం రెండు 30 రోజుల శిబిరాలు కూర్చొని ఉండాలి.
- 2 సంవత్సరాలుగా, రోజు 2 గంటల సాధన చేస్తూ ఉండాలి.
- కనీసం ఒక సంవత్సరం హత్య, లైంగిక దుష్ప్రవర్తన, మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ మరియు మిగతా సూత్రాలను ఎవరి సామర్థ్యం కొద్ది వారు పాటిస్తూ ఉండాలి.
- చివరిసారిగా చేసిన దీర్ఘ శిబిరం నుండి కనీసం 6 నెలల వ్యవధి ఉండాలి.
- దీర్ఘ శిబిరము మరియు ఇతర శిబిరం మధ్యలో 10 రోజుల వ్యవధి ఉండాలి.
- దీర్ఘ శిబిరంలో కూర్చుంటున్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాముల పూర్తి సహకారం ఉండాలి.
- మొదటి 45 రోజుల శిబిరం కోసం, మొదటి 30 రోజుల శిబిరం తరువాత కనీసం ఒక సాధారణ 10 రోజుల శిబిరం పూర్తి చేసి ఉండాలి.
-
30వ రోజు వరకు అన్ని నిర్ధారణలు తాత్కాలికం.
60 రోజుల శిబిరం
- ఈ పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీరమైన పూర్వ సాధకులై ఉండాలి.
- సహాయక ఆచార్యులకు మరియు ధమ్మ సేవలో లోతుగా నిమగ్నం అయిన వారికే పరిమితం.
- కనీసం గత 5 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఈ పద్ధతినే సాధన చేసి ఉండాలి.
- 2 సంవత్సరాలుగా, రోజు 2 గంటల సాధన చేస్తూ ఉండాలి.
- కనీసం ఒక సంవత్సరం హత్య, లైంగిక దుష్ప్రవర్తన, మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ మరియు మిగతా సూత్రాలను ఎవరి సామర్థ్యం కొద్ది వారు పాటిస్తూ ఉండాలి.
- చివరిసారిగా చేసిన దీర్ఘ శిబిరం నుండి కనీసం 6 నెలల వ్యవధి ఉండాలి.
- దీర్ఘ శిబిరము మరియు ఇతర శిబిరం మధ్యలో 10 రోజుల వ్యవధి ఉండాలి.
-
దీర్ఘ శిబిరంలో కూర్చుంటున్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాముల పూర్తి సహకారం ఉండాలి.
"
పైన తెలుపబడినవి కనీస అర్హతలు మాత్రమే, ప్రవేశ హామీలు మాత్రం కావు. 10 రోజుల ప్రత్యేక శిబిరం, 20 రోజుల శిబిరం, 30 రోజుల శిబిరం, 45 రోజుల శిబిరం, 60 రోజుల శిబిరం మరియు ఆచార్యుల స్వయం శిబిరంల దరఖాస్తులలో మీ గురించి బాగా తెలిసిన సహాయక ఆచార్యుల సిఫార్సు మరియు మీ ప్రాంతీయ పూర్తి ఆచార్యుని సిఫార్సులు కలిగి ఉండాలి.